పరిశోధన మరియు నివేదికలు
ARA సభ్యత్వం యొక్క ఖర్చులు మరియు ప్రయోజనాలను అంచనా వేయడానికి రైతులను సర్వే చేయడం
రైతులతో బాగా పాల్గొనడానికి కావడానికి మరియు క్షేత్రస్థాయి ఇబ్బందులను పరిష్కరించడానికి మా విధానాన్ని మేము ఎప్పటికప్పుడు మూల్యాంకనం చేస్తూ ఉంటాము. అలాంటి ఒక మూల్యాంకనం నుంచి వచ్చిన ఫలితాల గురించి చదువుతాము: ARAలో నమోదు అవ్వడం వల్ల అయ్యే ఖర్చులు మరియు ప్రయోజనాలను అంచనా చెయ్యడానికి 20 మంది రైతుల సర్వే చేసాము.
మా చిన్న-స్థాయి, సప్లిమెంటరీ ఫీడింగ్ పరీక్ష యొక్క ఫలితాలు
ఇక్కడ, మేము ఈ మధ్యే నిర్వహించిన ఒక చిన్న-స్థాయి పరీక్ష ఫలితాలను వివరిస్తాము - అనుబంధ ఆహారాన్ని తగ్గించడం ద్వారా చేపల పెరుగుదల మరియు చెరువులలో నీటి నాణ్యత ఎలా ప్రభావితమవుతాయో అనేదే ఈ పరిశోధన. ఈ నవీకరణ చేపల సంక్షేమాన్ని బాగా అర్థం చేసుకోవడానికి మరియు మా ప్రోగ్రెస్ ని, మా విధానాన్ని మా వాటాదారులు లకు తెలియజేయడానికి రూపొందించబడింది.
భారతదేశంలోని 505 మంది చేపల పెంపకపు రైతులపై చేసిన మా సర్వే ఫలితాలు
ఈ రిపోర్ట్ లో, మేము మార్చి 2023 లో కండక్ట్ చేసిన భారతీయ ఆక్వాకల్చర్ రైతుల యొక్క పెద్ద సర్వే యొక్క ఎనాలిసిస్ ను అందిస్తున్నాము. భారతదేశం, ఆంధ్రప్రదేశ్ లోని చెరువులలో భాగస్వామ్య లక్షణాలు, సర్వే చెయ్యబడిన ప్రాంతాలలో వేరియేషన్లు మరియు పెంపకపు చేపలలో మారుతున్న అవసరాల ఆధారంగా మా ఫిష్ వెల్ఫేర్ స్టాండర్డ్ ను మార్చడానికి ఈ పరిశోధన మాకు బాగా సహాయపడుతుంది.
ఫిష్ వెల్ఫేర్ స్కోపింగ్ రిపోర్ట్: ఇండియా
ఆక్వాకల్చర్ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆహార ఉత్పత్తి రంగం, సుమారు 73 నుండి 180 బిలియన్ల వరకు పెంచిన చేపలు ఏ సమయంలోనైనా జీవించి ఉంటున్నాయి. అయినా కానీ వాటి సంక్షేమంపై ఇంతవరకు ఎవరూ పెద్దగా శ్రద్ధ చూపలేదు. చేపలను తరచుగా చెడు పర్యావరణ పరిస్థితులలో మరియు అధిక సాంద్రతలో ఉంచుతారు, మరియు అవి వేగంగా పెరగడానికి ఆహారం ఇచ్చి దయ లేకుండా చంపుతూ ఉంటారు...
ఆక్వాకల్చర్ లో చేపల సంక్షేమ మెరుగుదలలు
చేపల సంక్షేమం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక అంశం. చేపలు దీనిలో కేంద్రబిందువుగా ఉన్నప్పటికీ, చేపల సంక్షేమాన్ని మెరుగుపరచడం యొక్క విలువ చేపల కన్నా మించినది. చేపల సంక్షేమం పర్యావరణానికి ప్రయోజనం చేకూరుస్తుంది, గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేస్తుంది మరియు సామాజిక శ్రేయస్సును ముందుకు తీసుకువెళుతుంది. అందుకని, ఆక్వాకల్చర్ లో చేపల సంక్షేమాన్ని మెరుగుపరచడం ఒక కీలకమైన విషయం...