మా టీమ్
ఫిష్ వెల్ఫేర్ ఇనిషియేటివ్ ఇండియా అనేది చేపల బాధలను వీలైనంత వరకు తగ్గించాలనే సాధారణ అభిరుచితో విభిన్న నేపథ్యాల నుండి వచ్చిన వ్యక్తులతో రూపొందించబడింది. వాటిని తెలుసుకోవడానికి చదవండి.
బృందం
కార్తీక్ పులుగుర్త
కార్తీక్ కు జంతు సంక్షేమం మరియు నైతిక జీవనోపాధి రంగంలో నేపథ్యం ఉంది. ఈయన జిందాల్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ నుంచి డిప్లొమాసీ, లా & బిజినెస్ (MA DLB)లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఇండియాలోని నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ లో PhD స్కాలర్ గా ఉన్న ఈయన గతంలో యూనివర్సిటీ యానిమల్ లా సెంటర్ ను మేనేజ్ చేశారు. అక్కడ ఉన్నప్పుడు, అతను భారతదేశంలో పారిశ్రామిక గుడ్ల ఉత్పత్తికి సంబంధించిన అనైతిక పద్ధతులపై వెలుగుచూసే పరిశోధనను చేపట్టారు. ఆయన తెలుగు దేశం పార్టీకి చెందిన పదహారు మంది పార్లమెంటు సభ్యులకు పరిశోధన మరియు జీవనోపాధి సలహాదారుగా కూడా పనిచేశారు. కార్తిక్ జంతు మరియు మనుషుల బాధలను అంతం చెయ్యడానికి నిబద్ధతో కట్టుబడి ఉన్నారు మరియు మార్పు కోసం బాటమ్ అప్ పద్దతిని బాగా నమ్మారు.
మేనేజింగ్ డైరెక్టర్, ఇండియా
శ్రీ రంగ్ కె
శ్రీ రంగ్ ఎప్పుడూ జంతువుల బాధలను సాధ్యమైనంత వరకు తగ్గించడానికి పని చేస్తూ ఉంటారు. ఈయన FWI ఇండియా కో-డైరెక్టర్ గానే కాకుండా రొయ్యల సంక్షేమ ప్రాజెక్టుకు ఇండియా కోఆర్డినేటర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. జంతు హక్కులు మరియు సంక్షేమంలో ఎనిమిది సంవత్సరాల అనుభవం మరియు ప్రకటనలలో అతని నేపథ్యంతో, ఇతను వివిధ ట్రేడ్ షోలు మరియు భారతీయ సంస్థలకు సృజనాత్మక వ్యూహకర్తగా పనిచేశాడు.
కో-డైరెక్టర్
ఐశ్వర్య నాగుల
ఐశ్వర్య చాలా సంవత్సరాలుగా జంతు సంరక్షణలో చురుకుగా పాల్గొంటూ పెంపకపు జంతు సంరక్షణపై చాలా మక్కువను కలిగి ఉన్నారు. ఫ్యాక్టరీ ఫార్మింగ్ పై సమాజానికి అవగాహన కల్పించడానికి ఆమె చాలా వర్క్ షాప్ లను నిర్వహించారు. FWIకి ముందు, ఆమె సంస్థలు మరియు కార్పొరేషన్లలో పెంపకపు జంతువుల కోసం ఉన్నత సంక్షేమ విధానాలను ప్రోత్సహించే దిశగా ఆమె పనిచేశారు. ఆమె బెంగళూరులోని అలయన్స్ స్కూల్ ఆఫ్ లా నుంచి లా డిగ్రీలో పట్టా పొందారు. ఐశ్వర్యకు వంట చెయ్యడం, రైటింగ్ మరియు తన కుక్క పోహాతో సమయం గడపడం అంటే చాలా ఇష్టం.
కో-డైరెక్టర్, ఇండియా
వివేక్ కోస్టల్ ఆక్వాకల్చర్ మరియు మెరైన్ బయోటెక్నాలజీ బ్యాక్ గ్రౌండ్ కలిగిన గర్వించదగిన కంజర్వేషనిస్ట్ మరియు ఆక్వాకల్చరిస్ట్. ఆయన గతంలో CSIR- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ, ఇండియాలో సముద్ర పరిశోధనలతో బయోలాజికల్ ఓషనోగ్రాఫర్ గా పనిచేశారు. నిజమైన కంజర్వేషన్ ఔత్సాహికుడైన వివేక్ ఆంధ్రప్రదేశ్ లోని ఫిషింగ్ క్యాట్ కన్జర్వెన్సీ (FCC), మరియు హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ (HYTICOS) లాంటి అనేక సంస్థలతో పాటు మాంగ్రోవ్ అడవుల పునరుద్ధరణ కార్యకలాపాలలో పాల్గొన్నారు. ఈస్ట్ కోస్ట్ కన్జర్వేషన్ టీమ్ (ECCT)లో ఒక యాక్టివ్ మెంబెర్ గా ఉన్నారు. ఖాళీ సమయాల్లో వివేక్ ఒక బీట్ బాక్సర్, మరియు ప్రకృతి, వన్యప్రాణుల అన్వేషణపై మక్కువ ఉన్న నైపుణ్యం కలిగిన ఒక ఫొటోగ్రాఫర్.
Senior Project Manager
వివేక్ రాచూరి
దుర్గా ప్రసాద్
ఆక్వాకల్చర్ లో బ్యాచిలర్ డిగ్రీ పొందిన దుర్గాప్రసాద్ కు రొయ్యల హేచరీల్లో మైక్రోబయాలజీ, ఆల్గే పెంపకం, వాటర్ క్వాలిటీ అనాలిసిస్ లో సాంకేతిక నైపుణ్యం ఉంది. ఈయన ఆంధ్రప్రదేశ్ కు చెందిన సాంప్రదాయ జానపద నృత్య రూపమైన కోలాటం బృందంలో ఒక సభ్యుడు, మరియు స్థానిక పండుగల సమయంలో ప్రసిద్ధ దేవాలయాలలో ప్రదర్శనలు ఇస్తారు.
డేటా కలెక్టర్