చేపల సంక్షేమం ఎందుకు అవసరం?
చేపల సంక్షేమం అనేది ప్రపంచంపై మంచి ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి, పరిశ్రమలు, పర్యావరణం మరియు చేపల కోసం అధిక సంక్షేమమే
ఉత్తమమైనదని మేము నమ్ముతున్నాము.
చేపల సంక్షేమం యొక్క ప్రభావాలు
01 అభివృద్ధి చెందే వ్యాపారం
వ్యాపార స్థితిస్థాపకత
ప్రపంచం మారుతూ ఉంది: ప్రజలు వారి ప్రొడక్ట్ లు ఎక్కడ నుంచి వస్తున్నాయి మరియు వారు కొన్నవి ఏ రకమైన పరిశ్రమను ప్రోత్సహిస్తుంది (Conte, 2014; Lai et al., 2018; Buller et al., 2018) అనే దాని గురించి ఆలోచిస్తూ జంతు సంక్షేమం గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఎక్కువ ప్రొడక్ట్ లు ఉండడంతో వినియోగదారులు యానిమల్ ప్రోటీన్ మరియు కొత్త ఆల్టర్నేటివ్స్ మధ్య వాళ్ళకు కావలసిన వాటిని ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం పెరుగుతున్న పోటీ మరియు డైనమిక్ మార్కెట్ లో సీఫుడ్ ఉత్పత్తిదారులు వయబుల్ గా ఉండటానికి ఏకైక మార్గం అధిక-నాణ్యత, సంక్షేమ-ఆధారిత ప్రొడక్ట్ లను అందించడమే.
యూరోపియన్ యూనియన్ లాంటి ప్రపంచ మార్కెట్ లు ఇప్పటికే సంక్షేమం మరియు హ్యూమేన్ ట్రీట్మెంట్ కోసం ఉండాల్సిన కనీస ప్రమాణాలను ప్రవేశపెట్టాయి (Buller et al., 2018). ఈ దేశాలకు ఎగుమతి చెయ్యాలంటే సంక్షేమం అనేది ప్రొడక్ట్ లో ప్రధాన భాగం అయి ఉండాలి.
ఈ పెరుగుతున్న మార్పుల్లో ఉన్నత సంక్షేమ ప్రమాణాలను ప్రవేశపెట్టడం అనేది ఒక మంచి నాయకుడిని సూచిస్తుంది. ఆక్వాకల్చర్ రంగం యొక్క భవిష్యత్తు లాభదాయకత మరియు స్థితిస్థాపకత సంక్షేమ ఆధారిత ప్రొడక్ట్ లలో ఉంది.
ఉత్పాదకత & సమర్థత
అధిక సంక్షేమం ఉన్న చేపలు మెరుగైన మనుగడ రేటును కలిగి ఉంటాయి మరియు పెంపకపు సామర్థ్యాన్ని పెంచుతాయి.
అధిక సంక్షేమం మరియు మెరుగైన సామర్థ్యం దగ్గరి సంబంధాన్ని కలిగి ఉంటాయి. సమర్థవంతమైన ప్రొడక్షన్ అనేది ఎప్పుడూ మంచి జంతు ఆరోగ్యాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎందుకంటే వ్యాధి సోకిన చేపలు అధిక మరణాలను ఇస్తూ తక్కువ దిగుబడులను కలిగి ఉంటాయి.
సంక్షేమాన్ని మెరుగుపరిచే రైతులు పెంపకం సమయంలో తక్కువ దూకుడుతో ఉంటూ, ఫిన్ నష్టాన్ని తగ్గించుకుంటూ, మెరుగైన వృద్ధి రేటు మరియు ఫీడ్ కన్వర్షన్ రేట్ లను (Stewart et al., 2012; Schneider et al., 2012) పొందుతారు. నీటి నాణ్యతను పెంచడానికి ఎయిరేటర్లను ఉపయోగించడం మనుగడ రేటును సుమారు 43% పెంచుతుందని ఒక అధ్యయనం కనిపెట్టింది, అలాగే ఇది పెంపకపు లాభాన్ని కూడా పెంచుతుంది (Qayyum et al., 2005).
సరైన ట్రాన్స్పోర్ట్ మరియు హ్యాండ్లింగ్ అనేది స్ట్రెస్ మరియు మరణాల రేటును ఎక్కువ శాతం వరకు తగ్గిస్తుంది (FAO, 2008). వధించడంతో సంబంధం ఉన్న బాధలు మరియు స్ట్రెస్ ని తక్కువగా ఉంచడం జంతు సంక్షేమాన్ని మాత్రమే కాకుండా అధిక ప్రొడక్ట్ క్వాలిటీ మెరుగుపడేలా నిర్ధారిస్తుందని చెప్పబడింది (Holmyard, 2017).
సంక్షేమ-ఆధారిత ప్రొడక్టులు కూడా వినియోగదారులచే ప్రశంసించబడతాయి, మరియు వాళ్ళు ఈ సంక్షేమ-స్నేహపూర్వకమైన వాటి కోసం ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టడానికి సిద్ధంగా ఉంటారు (Lai et al., 2018; BENEFISH Final Activity Report, 2010). సంక్షేమాన్ని మెరుగుపరచడం ద్వారా, రైతులు వారి సామర్థ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, వారి ప్రొడక్టులను ప్రైస్ ప్రీమియంకు అమ్మవచ్చు మరియు ఆదాయాన్ని పెంచుకోవచ్చు.
పని చేసే వాళ్ళ సంతృప్తి
చేపలు నొప్పిని అనుభవిస్తాయని మరియు వాటి సంక్షేమాన్ని పెంచడం ద్వారా మరణాలను తగ్గించవచ్చని పెంపకదారులకు కూడా తెలుసు (Adams, 2019). పలువురు పెంపకదారులు తాము పెంచే చేపల పట్ల తమకు నిజమైన శ్రద్ధ ఉందని, వాటి చెరువుల్లో సంక్షేమాన్ని మెరుగుపరచాలని అనుకుంటున్నామని మాకు చెప్పారు. వాళ్ళు తగిన స్టాకింగ్ డెన్సిటీలు మరియు మంచి నీటి నాణ్యత యొక్క ప్రాముఖ్యతను అంగీకరించి ఆక్వాకల్చర్ చెరువులలో అభివృద్ధి చెందుతున్న వ్యాధుల గురించి ఆందోళన చెందుతారు (Read, 2008). అలా వాళ్ళు చేపల సంక్షేమం గురించి ఆందోళన చెందుతున్నారు కాబట్టి, పెంపకపు పనులు వాటి బాధను తగ్గించాలని భావిస్తున్నారు.
సంక్షేమంతో కూడిన పని యొక్క మార్గదర్శకాలు చేపల పెంపకం పరిస్థితులను మెరుగుపరచడానికి పెంపకదారులకు అనుమతిస్తాయి. ఈ పెంపకదారులు అధిక మనుగడ రేటుకు చాలా బాగా సహాయపడవచ్చు, ఇది వారి ఉద్యోగ సాధన యొక్క భావాన్ని పెంచుతుంది. అందుకనే అధిక సంక్షేమం ఎక్కువ ఫిష్ ఫ్రెండ్లీ పనులకు మరియు ఆ పనిని పూర్తిగా విశ్వసించే పెంపకదారులకు ప్రారంభ దశ.
02 ఆరోగ్యకరమైన సమాజం
ఆహార భద్రత
అధిక ప్రొడక్ట్ క్వాలిటీ పొందడానికి తక్కువ బాధ ఉండే వధించే పద్ధతిని ఎంచుకోవడం చాలా అవసరమని శాస్త్రవేత్తలు నిరూపించారు (Poli, 2009). వధించడానికి ముందు మరియు వధించే సమయంలో ఉండే స్ట్రెస్ చేపలను ప్రభావితం చెయ్యడమే కాకుండా వాటి క్వాలిటీ తగ్గడానికి దారితీస్తుంది.
చేపల ప్రొడక్ట్ లలో బ్యాక్టీరియా, వైరస్లు, బయోటాక్సిన్లు మరియు పారాసైట్లు ఉండవచ్చు, ఇవన్నీ సంక్షేమం సరిగ్గా లేనప్పుడు వస్తాయి (EFSA, 2008 & EFSA, 2009). వధించిన తర్వాత దీర్ఘకాలిక స్ట్రెస్ బ్యాక్టీరియా పెరుగుదలను పెంచుతుంది (EFSA, 2009).
పెంపకం మరియు వధించే సమయంలో స్ట్రెస్ ని తగ్గించడం చేపల సంక్షేమాన్ని కాపాడుతుంది. ఉదాహరణకు, హానికరమైన పోస్ట్-మార్టం ప్రాసెస్ లను తగ్గించడానికి ప్రభావవంతమైన స్టన్నింగ్ పద్ధతులు చూపించబడ్డాయి. దీని ఫలితంగా, అధిక చేపల సంక్షేమం చేపల మానవీయ చికిత్సను నిర్ధారిస్తుంది మరియు ఆహార భద్రతను మెరుగుపరుస్తుంది.
వ్యాధి నియంత్రణ
చేపలలో పాథోజెన్ ఉనికి మరియు స్ట్రెస్ లు వ్యాధి మరియు పారసైట్ వ్యాప్తికి దారితీస్తాయి. చాలా వ్యాప్తి అనేది సంక్షేమం సరిగ్గా లేనప్పుడు కలుగుతుంది (Aslesen et al., 2009; McClure et al., 2005). చెరువులలో, వ్యాధి వ్యాప్తి అనేది ఆర్థిక ఇబ్బందులు, ఆహార కొరత మరియు ఇండస్ట్రీ ఫెయిల్యూర్ ని కూడా ప్రేరేపిస్తుంది (Arthur & Subasinghe, 2002). ఈ వ్యాప్తి ప్రపంచ ఆక్వాకల్చర్ పరిశ్రమకు సంవత్సరానికి 6 బిలియన్ డాలర్ల నష్టాన్ని కలిగిస్తుంది మరియు ఈ సెక్టార్ యొక్క అంచనా వృద్ధికి బ్రేకింగ్ పాయింట్ లాగా అవుతుంది (Stentiford et al., 2017).
వ్యాధులు మరియు పారసైట్ లు తరచుగా అడవి జంతువులకు వ్యాపిచెందుతాయి, అక్కడ అవి పూర్తి పర్యావరణ వ్యవస్థలకు ప్రమాదం కలిగిస్తాయి (Naylor, 2005). ఈ వ్యాధులను ఎదుర్కోవడానికి, పెంచుతున్న చేపలను సాధారణంగా యాంటీమైక్రోబయాల్స్ తో చికిత్స చేస్తారు. అయినప్పటికీ ఇవి వాటి స్వంత ఆరోగ్య ప్రమాదాలను కలిగి ఉంటాయి: యాంటీమైక్రోబయాల్స్ అల్ట్రా-రెసిస్టెంట్ బ్యాక్టీరియా జాతుల అభివృద్ధిని పెంచుతాయి, ఇవి చేపలను వదిలి మనుషుల్లోకి ప్రవేశిస్తాయి (EFSA, 2008).
మానవత్వంతో పెంచిన చేపలకు రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉంటుంది. ఇది అంటువ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది, వ్యాధి వ్యాప్తిని తగ్గిస్తుంది మరియు యాంటీమైక్రోబయాల్స్ అవసరాన్ని తగ్గిస్తుంది.
03 సుస్థిరమైన పర్యావరణం
పరిశుభ్రమైన నీటివనరులు
శుద్ధి చెయ్యని ఆక్వాకల్చర్ మురుగునీరు విషపూరితమైనది, ఇది పర్యావరణాన్ని క్షీణింపజేస్తుంది మరియు అందులోని వ్యవస్థలకు ఇబ్బంది కలిగిస్తుంది (Adams, 2019). మురుగునీరు యూట్రోఫికేషన్ కు గణనీయంగా సహాయపడుతుంది, దీనివల్ల ఆల్గల్ బ్లూమ్స్ మరియు ఓషన్ డెడ్ జోన్లు ఏర్పడతాయి (Global Aquaculture Alliance, 2019). ఆక్వాకల్చర్ వ్యర్థాలలో యాంటీమైక్రోబయాల్స్ కూడా ఉంటాయి, ఇది మనుషులలోకి వెళ్తే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి.
మెరుగైన చేపల సంక్షేమం హానికరమైన మురుగునీటి ఉత్పత్తిని తగ్గిస్తుంది:
-
సరైన ఫీడింగ్ సిస్టంలు దూకుడును తగ్గిస్తాయి, ఫీడ్ కన్వర్షన్ రేషియోలను (FCR) మెరుగుపరుస్తాయి మరియు తక్కువ ఫీడ్ ను నీటిలో నిలిచిపోయేలా చేస్తాయి (Gan et al., 2013).
-
సరైన స్టాకింగ్ డెన్సిటీలు మరియు తక్కువ రద్దీ అనేది ఆహార సామర్థ్యాన్ని పెంచి మెరుగైన FCRలకు దారితీస్తాయి (Santos et al., 2010).
-
తక్కువ స్ట్రెస్ కి గురైన చేపలు మెరుగైన రోగనిరోధక పనితీరును కలిగి ఉంటాయి (McClure et al., 2005), ఇది యాంటీమైక్రోబయాల్స్ అవసరాన్ని తగ్గిస్తుంది. అలా కొన్ని యాంటీమైక్రోబయాల్స్ చుట్టుపక్కల వాతావరణంలో మిగిలి ఉంటాయి.
ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థలు
సంక్షేమ-ఆధారితం లేని ఆక్వాకల్చర్ పర్యావరణ వ్యవస్థలను మూడు విధాలుగా ప్రభావితం చేస్తుంది:
-
ఆక్వాకల్చర్ పనుల నుంచి వ్యాప్తి చెందిన ఆహారం అడవి చేపలను ఆకర్షిస్తుంది. ఇది పెంపకపు పనులకు హాని కలిగించి మరియు ఆక్వాకల్చర్ గేర్ లో చిక్కుకోవడం ద్వారా తమను తాము గాయపరచుకోగల పెద్ద వేటాడే చేపలు మరియు క్షీరదాలను (Miller & Semmens, 2002) ఆకర్షిస్తుంది (Barrett et al., 2018).
-
చెరువుల దగ్గర సేకరించే అడవి చేపలకు వ్యాధులు, పారసైట్ లు ఉండే అవకాశం 16 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇవి పెంచే జంతువులు మరియు అడవి జంతువుల మధ్య సులభంగా వ్యాప్తి చెందుతాయి (Barrett et al., 2018).
-
చేపలు తరచుగా పొలాల నుంచి తప్పించుకుని, పరస్పర సంతానోత్పత్తి, రిసోర్స్ ల కోసం పోటీపడటం మరియు వ్యాధులు మరియు పారసైట్ లను అందిపుచ్చుకోవడం ద్వారా స్థానిక జాతులకు ముప్పును కలిగిస్తాయి (Flatt & Ryan, 2017).
సరైన పెంపకపు చేపల సంక్షేమం ఈ ప్రమాదాలను చాలా వరకు తగ్గిస్తుంది. మంచి సంక్షేమంతో, చేపలు బాగా సమర్థవంతంగా మేతను తింటాయి మరియు అడవి చేపలను ఆకర్షించే తక్కువ దాణా వ్యాప్తి చెందుతుంది (Miller & Semmens, 2002). చేపలకు అంటువ్యాధులు మరియు పారసైట్ లు తక్కువగా సోకుతాయి, అలా అవి అడవి జనాభాకు వ్యాప్తి చెందే అవకాశాన్ని తగ్గిస్తాయి (Naylor & Burke, 2005). తక్కువ స్ట్రెస్ కి గురైన చేపలు తప్పించుకోవడానికి ఆసక్తి చూపకుండా ఉంటాయి (Cerqueira et al., 2020 & 2017).
04 చేపల కోసం మెరుగైన జీవితాలు
ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆహార రంగం ఆక్వాకల్చర్, మరియు ఇప్పటికే 50% పైగా సీఫుడ్ అనేది చెరువుల నుంచే వస్తుంది (Ritchie & Roser, 2020). ఈ చెరువులలో, ఏ సమయంలోనైనా 73 నుండి 180 బిలియన్ చేపలను పెంచడం జరుగుతుంది (Fishcount, 2019). భవిష్యత్తులో, ఆక్వాకల్చర్ ఇంకా బాగా విస్తరించే అవకాశం ఉంది మరియు ఎక్కువ శాతం సీఫుడ్ ని ఈ రంగమే ఉత్పత్తి చేస్తుంది.
అయినప్పటికీ, ఆక్వాకల్చర్ లో పెంచే అనేక చేపలు తీవ్రంగా నష్టపోతూనే ఉన్నాయి. ఈ సంక్షేమ సమస్యలలో వ్యాధులు, గుంపులుగా తయారవడం, సక్రమంగా నిర్వహించకపోవడం, నీటి నాణ్యత సరిగ్గా లేకపోవడం మరియు సహజ ప్రవర్తనను ప్రదర్శించలేకపోవడం ఉన్నాయి (e.g., Animal Charity Evaluators, 2019, Cerqueira & Billington, 2020). దీని పర్యవసానంగా, చాలా ఆక్వాకల్చర్ చెరువులలో, చేపలు ఎప్పుడూ స్ట్రెస్ కి గురవుతున్నాయి మరియు మరణాల రేటు ఎక్కువగా ఉంటుంది (Ashley, 2007).
ఇలాంటి బాధ సరైనది కాదు, ఎందుకంటే చేపలు భూమిపై పెరుగుతున్న జంతువుల లానే నొప్పిని అనుభవించగల సున్నితమైన జీవులు (e.g., Brown, 2014; Braithwaite, 2010; Riberolles, 2020; Babb, 2020). చట్టపరంగా అవసరం లేకపోయినా, అవి జీవించడానికి సరైన జీవితాన్ని అందించాల్సిన నైతిక బాధ్యత మనపై ఉంది. అందుకోసం మానవీయ పెంపకం, సరైన రవాణా, మరియు బాధలను తగ్గించే వధించే పద్ధతులు పాటించాల్సిన బాధ్యత మనపై ఎంతో ఉంది.